ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. జిల్లాకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న వేళ ఖమ్మం జిల్లా(Khammam District)లో కాంగ్రెస్కు షాక్ తగిలింది. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, విద్యార్థి నేత మానవతారాయ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి కృష్ణ(Edavalli Krishna), సీనియర్ నేతలు అబ్బయ్య, వెంకట్ గౌడ్ తదితర నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ (BRS)లో చేరారు. పాలేరు నుంచి సంభాని మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నెల 13న దమ్మపేటలో జరగనున్న కేసీఆర్ సభలో.. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం. సంభాని చంద్రశేఖర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు (Paleru) నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసి జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఓ దశలో ఆయన ఏపీకి పీసీసీ చీఫ్ కూడా అవుతారన్న చర్చ కూడా సాగింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని సంకేతాలు వస్తున్న తరుణంలో ఇక్కడే దెబ్బ కొట్టాలని గులాబీ బాస్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి (Ponguleti) శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఈ ఇద్దరు ఎప్పుడైతే కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారో ఖమ్మంలో ‘కారు’కు పంచర్ అయినట్లయ్యింది.!. దీంతో ఆ ఇద్దరి స్థానాలను భర్తీ చేసేందుకు ఇప్పటికే కొందరు ముఖ్య నేతలకు గులాబీ కండువా కప్పి టికెట్లు కూడా కేటాయించారు. అంతటితో ఆగని కేసీఆర్.. జిల్లాలోని సీనియర్ నేతలు, కాంగ్రెస్ ప్రముఖులను, ముఖ్యనేతలను బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు