»Meteorological Department Rain Alert Rain Forecast For Telugu States
Rain Alert : వాతావరణశాఖ రెయిన్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన
తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన చెప్పింది వాతావరణశాఖ (Weather Dept) . ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. మరో పక్క నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తమినాడులో ఈశాన్య రుతుపవనాలు క్రియాశీలంగా ఉన్నాయని దీంతో ఖమ్మం(Khammam) ,నల్గొండ,సూర్యాపేట, జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్(Hyderabad) వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు ఏపీకి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాలకు నేడు వర్షసూచన జారీ చేసింది. పల్నాడు, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, నంద్యాల, తిరుపతి(Tirupati), అన్నమయ్య, , కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని అంచనా వేసింది.
ఇక మరికొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత ఉంటుందని, ఉష్ణోగ్రతలు (Temperatures) పెరుగతాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.కొన్ని జిల్లాల్లో ఎండ ప్రభావం ఎక్కువైంది. దీంతో ఎండాకాలన్ని తలపిస్తోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు పలు జిల్లాల్లో 31 నుంచి 33 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. అలాటే రాత్రివేళల్లో కూడా 21 నుంచి 23 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. నెల రోజులుగా కొన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఎండతో పాటు ఉక్కబోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇటు తెలంగాణ(Telangana)లో కూడా భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం నుంచే ఎండలు మొదలుకావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.