ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. భానుడి ప్రతాపం తగ్గి అక్కడక్కడా వర్షాలు పడితే కాస్తయినా ఉపశమనం లభిస్తుందేమోనని ప్రజలు భావిస్తున్నారు.
Rain in Hyderabad november 23rd 2023 GHMC to be alert again to local people
Rain Alert :ఇంకా పూర్తి వేసవికాలంలోకి రాకుండానే ఎండలు జనాల్ని హడలెత్తిస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే అసలు ఎండల్లో పరిస్థితి ఏంటని అంతా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. అల్లూరి, కోనసీమ, తూర్పు గోదావరి.. తదితర జిల్లాల్లో ఉరుములు, పిడుగుపాట్లతో వర్షాలు(rain) కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
ఏపీ(Andhra Pradesh) విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం… జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో వర్షాలు(rain) పడే అవకాశం ఉంది. అల్లూరి, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం తదితర జిల్లాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. మిగిలిన కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం తదితర జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. అయితే తేలికపాటి వర్షాలు ఉన్నా, ఓ మోస్తరు వర్షాలు ఉన్నా ఉరుములు, మెరుపులు వస్తాయి. పిడుగులూ పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి పొలాలు, మైదానాలు, బహిరంగ ప్రదేశాల్లో పని చేసుకునే వారు అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ స్తంభాల్లాంటి వాటికి దగ్గర్లో ఉండొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది.
తెలంగాణలో(telangana) మరో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు ద్రోణి కొనసాగుతున్నట్లు తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. కొన్ని జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ‘పసుపు’ రంగు హెచ్చరిక సైతం జారీ చేసింది.