Pushpa 2: బన్నీ బర్త్ డే ట్రీట్.. ‘పుష్ప2’ మోత మోగాల్సిందే?
పోయిన బర్త్ డేకి వేర్ ఈజ్ పుష్ప అంటూ దుమ్ములేపిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఈసారి మోత మోగించడానికి వచ్చేస్తున్నాడు. 2024 బన్నీ బర్త్ డే ట్రీట్‌గా పుష్ప2 నుంచి సాలిడ్ కంటెంట్ బయటికి రానున్నట్టుగా తెలుస్తోంది.
Bunny birthday treat. 'Pushpa 2' should be called?
Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప పార్ట్ 1.. పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో పుష్ప పార్ట్ 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పుష్ప2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆగష్టు 15న సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వేర్ ఈజ్ పుష్ప అంటూ రిలీజ్ చేసిన గ్లింప్స్ అదిరిపోయింది. అలాగే.. అమ్మవారి గెటప్‌లో బన్నీ లుక్ రివీల్ చేయగా.. అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. అయితే.. ఇవి తప్పితే పుష్ప2 నుంచి మరో సాలిడ్ అప్డేట్ బయటికి రాలేదు. దీంతో నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు అల్లు ఫ్యాన్స్. తాజాగా పుష్ప2 నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతుందని తెలుస్తుంది. వచ్చే నెల ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే ఉంది.
ఈ సందర్బంగా పుష్ప2 ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పుష్ప 1కి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పార్ట్ 2 విషయంలో కూడా అంతకు మించి అదిరిపోయే అవుట్ పుట్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ మాసివ్ ట్యూన్స్ ఇచ్చినట్టుగా సమాచారం. దీంతో బన్నీ బర్త్ డే ట్రీట్‌గా ఫస్ట్ సింగిల్ బయటికొచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే.. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.