ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లడం ఖాయం అని కేంద్ర మంత్రి అశ్విని చౌబే అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని, ప్రజల బాధలు తీరుస్తుందని పేర్కొన్నారు.
Kavitha is certain to go to jail in the liquor case.. Union Minister Ashwini Chaubey
Ashwini Chaubey: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కేంద్రమంత్రి అశ్విని చౌబే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హన్మకొండ హంటర్ రోడ్డులో మీడియా సెంటర్ను ప్రారంభించిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.. మద్యం కుంభకోణం కేసులో కవితను తప్పకుండా జైలుకు పంపిస్తామన్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కవిత, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. ఈ తొమ్మిన్నరేళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంది తప్ప అభివృద్ధి చేయలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తుందని వెల్లడించారు.