»Announcement Of The Final List Of Bjp And Congress In Telangana Elections 2023
Telangana:లో బీజేపీ, కాంగ్రెస్ తుది జాబితాలు ప్రకటన..సీట్ రానివారి అసంతృప్తి
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థుల తుదిజాబితాలు వచ్చేశాయి. తాజాగా బీజేపీ 14 మందితోకూడిన లిస్టును ప్రకటించగా..నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీ కూడా నలుగురితోకూడిన జాబితాను వెలువరించింది. అయితే సీట్ దక్కిన వారు సంతోషంగా ఉండగా..రాని వారు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
Announcement of the finalists of BJP and Congress in Telangana elections 2023
భారతీయ జనతా పార్టీ (BJP) శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల 2023 అభ్యర్థుల తుది జాబితాను 14 పేర్లతో విడుదల చేసింది. తుది అభ్యర్థుల జాబితాలో మల్కాజిగిరికి ఎన్ రామచందర్ రావు, నాంపల్లికి రాహుల్ చంద్ర, శేరిలింగంపల్లికి రవికుమార్ యాదవ్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ గణేష్ నారాయణ, పెద్దపల్లికి డి ప్రదీప్, సంగారెడ్డికి దేశ్ పాండే రాజేశ్వర్ రావు, మేడ్చల్ కు వై సుదర్శన్ రెడ్డి, మేడ్చల్ అభ్యర్థిగా కొండా ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. దేవరకద్ర, అలంపూర్ (SC)కి మేరమ్మ, నర్సంపేటకు కె.పుల్లారావు, మధిరకు పి.విజయరాజు. ఈ ప్రకటనకు ముందే మొత్తం 119 స్థానాల్లో 100 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. తమ ఎన్నికల సహకారంలో భాగంగా ఆ పార్టీ తన మిత్రపక్షమైన జనసేన పార్టీకి ఎనిమిది సీట్లను కూడా కేటాయించింది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ(congress party) కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే నలుగురు అభ్యర్థులతో కూడిన తుది జాబితాను గురువారం రాత్రి విడుదల చేసింది. పటాన్చెరులో ఇప్పటికే జాబితాలో స్థానం పొందిన నీలం మధు ముదిరాజ్ స్థానంలో కట్టా శ్రీనివాస్‌గౌడ్‌ను అభ్యర్థిగా ఎంపిక చేసింది. అయితే ముందు నీలం మధును పార్టీ ఎంపిక చేసిన నేపథ్యంలో శ్రీనివాస్ గౌడ్ అనుచరుల నుంచి తీవ్ర నిరసనలు వచ్చాయి. ఈ క్రమంలోనే నీలం మధు స్థానాన్ని మార్పు చేశారు. ముదిరాజ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంపై సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.
The Central Election Committee has selected the following persons as Congress candidates for the ensuing elections to Telangana Assembly.👇🏼 pic.twitter.com/USKv6QCCs6
ఇక చార్మినార్ నుంచి మహ్మద్ ముజీబ్ ఉల్లా షరీఫ్, మిర్యాలగూడ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి, సూర్యాపేట నుంచి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్డ్గా ఉన్న తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్ కు బదులుగా మందుల శామ్యూల్‌ను ఎంపిక చేసింది. కానీ తుంగతుర్తిలో సీనియర్ నేత అద్దంకి దయాకర్ కు టిక్కెట్ కేటాయించకపోవడంపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డికి కూడా ఈ జాబితాలో టిక్కెట్ ప్రకటించకపోవడం ఆయనతోపాటు అతని కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు(telangana assembly elections 2023) సంబంధించిన కీలక తేదీల్లో నవంబర్ 3న నోటిఫికేషన్ రాగా.. నేడు (నవంబర్ 10న) అభ్యర్థుల నామినేషన్ గడువు ముగియనుంది. నవంబర్ 15న అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీగా ప్రకటించారు. 119 మంది సభ్యుల తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి.