పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం మంచి పద్ధతి కాదని సూచించారు.
Revanth Reddy, Bhatti Condemned On IT Raids At Ponguleti House
Ponguleti: కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇది ముమ్మాటికీ కక్షసాధింపేనని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నిన్న తుమ్మల నాగేశ్వరరావు.. ఈ రోజు పొంగులేటి లక్ష్యంగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఎందుకు దాడులు జరగడం లేదని అడిగారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని రేవంత్ అంటున్నారు. మోడీ-కేడీకి సమాచారం రావడంతో భయపడుతున్నారని ధ్వజమెత్తారు. పొంగులేటిపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. నవంబర్ 30వ తేదీన కాంగ్రెస్ సునామీలో కమలం, కారు గల్లంతు అవడం ఖాయం అని అంటున్నారు. ఐటీ దాడులపై తనకు ముందే సమాచారం ఉందని పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని చెప్పారు. తమను భయపెట్టాలని చూస్తున్నారని తెలిపారు.
పొంగులేటి ఇంటిపై ఐటీ రైడ్స్ ఇష్యూపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. పొంగులేటికి పార్టీ అండగా ఉంటుందని స్పష్టంచేశారు. ఐటీ దాడులతో భయపెట్టాలని చూడటం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని సూచించారు. నామినేషన్ వేసే సమయంలో దాడులు చేసి భయపెట్టడం సరికాదన్నారు.
కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లో ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి ఐటీ దాడులు జరుగుతున్నాయి. 8 వాహనాల్లో ఖమ్మంలో గల పొంగులేటి నివాసానికి అధికారులు చేరుకున్నారు. వెంటనే సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకుని.. రైడ్స్ చేసుకున్నారు.