Content Creator Barrelakka Files Nomination At Kolhapur
Barrelakka Files Nomination: బర్రెలక్క (Barrelakka) పేరుతో యూట్యూబ్‌లో ఫేమస్ అయిన శిరీష ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఏదో పార్టీ తరఫున మాత్రం కాదండోయ్.. ఇండిపెండెంట్ అభ్యర్థి కొల్లాపూర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం నామినేషన్ వేసి.. మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యపై పోరాడేందుకు ఎన్నికల బరిలోకి దిగుతున్నానని తెలిపారు.
నిరుద్యోగిగా నామినేషన్ వేశానని శిరీష చెబుతున్నారు. మిగతా అభ్యర్థుల మాదిరిగా ప్రచారం చేయలేకపోవచ్చు.. డబ్బు పంచకపోవచ్చు.. ఓటర్ల మనస్సు మాత్రం తప్పకుండా గెలుచుకుంటానని చెబుతున్నారు. ఏది మంచి, ఏది చెడు అనేది వయోజనులు ఆలోచించాలని కోరారు. మీ మద్దతు తనకు కావాలని మరీ మరీ కోరారు.
శిరీష డిగ్రీ పూర్తి చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో పశుపోషణ వైపు మళ్లారు. తల్లి వద్ద కొంత డబ్బు తీసుకుని బర్రెలను కొనుగోలు చేశారు. వాటి పోషణ, ఇతర వీడియోలను చేశారు. వాటిని యూట్యూబ్‌లో పోస్ట్ చేసి కంటెంట్ క్రియేటర్‌గా మారారు. హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బర్రెలక్కను అని ఆమె పెట్టే పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఎన్నికల బరిలో నిలిపి కాక రేపారు.
అసలే.. గట్టి పోటీ ఉంది. పొత్తుల నేపథ్యంలో ప్రతి ఓటు ఇంపార్టెంట్ అవుతుంది. ఇంతలో బర్రెలక్క కొల్లాపూర్‌లో నామినేషన్ దాఖలు చేయడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.