Barrelakka nominated as Nagar Kurnool Lok Sabha MP
Barrelakka: నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానంలో బర్రెలక్క అలియాస్ శిరీష ఎంపీ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ దాఖలు చేసింది. ఆ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్లు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపింది. ఈ మేరకు తన డ్యాక్యుమెంట్స్ అన్నింటిని జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్ ఉదయ్ కుమార్కు అందించారు. దీనికి సంబంధించి న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో శిరీష కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆమె పోటీ అప్పటల్లో సంచలనం సృష్టించింది.
రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా విదేశాల నుంచి సైతం శిరీషకు మద్దతుగా నిలిచారు. ఇక సోషల్ మీడియాలో ఆమె పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఇక ఎన్నిల ఫలితాల్లో మాత్రం అనుకున్నంతగా ప్రభావం చూపలేకపోయింది. కేవలం 5 వేల ఓట్లకే పరిమితం అయింది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో పోటీకి సై అంటుంది. మరీ ఈ సారి తన ప్రభావ ఏ మేరకు చూపెట్టనుందో చూడాలి.