CM KCR: సీఎం కేసీఆర్‌పై (CM KCR) మంత్రి కేటీఆర్ (KTR) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, వైఎస్ఆర్ కలిపితే కేసీఆర్ అవుతారని అన్నారు. గత 25 ఏళ్లలో ముఖ్యమంత్రుల్లో ముగ్గురే మనకు గుర్తొస్తారని తెలిపారు. హైదరాబాద్ తాజ్ దక్కన్లో నిర్వహించిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశానికి హాజరయ్యారు.
ప్రో బిజినెస్, ప్రో అర్బన్, ప్రో ఐటీ అంటే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు అని కేటీఆర్ స్పష్టంచేశారు. ప్రో రూరల్, ప్రో అగ్రికల్చర్, ప్రో పూర్ అనేది వైఎస్ఆర్ ఇమేజ్ అని వివరించారు. ఈ రెండు లక్షణాలు సీఎం కేసీఆర్‌లో కనిపిస్తాయని చెప్పారు. కేసీఆర్ అంటే ప్రో అర్బన్, ప్రో రూరల్, ప్రో ఐటీ, ప్రో అగ్రికల్చర్, ప్రో బిజినెస్, ప్రో పూర్ అని చెప్పారు.
కేసీఆర్ అరుదైన నేత అని.. అతనిని జారవిడుచుకోవద్దని అక్కడున్న వారికి సూచించారు. కరెంట్ ఇవ్వడం, మంచి నీళ్లు ఇవ్వడం చెప్పినంత ఈజీ కాన్నారు. ఇన్నాళ్లూ పాలించిన వారు ఎందుకు నిరంతరాయంగా కరెంట్ ఇవ్వలేదని అడిగారు. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి.. కేసీఆర్ ముందుకు సాగుతున్నారని తెలిపారు.
గతంలో రైతులు ఆస్తులు అమ్ముకున్నా అప్పు కట్టలేని పరిస్థితి ఉంటేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు.. 2 పంటలు తీస్తూ.. అన్నదాతలు ధీమాగా ఉన్నారని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సుస్థిర ప్రభుత్వం అని.. సమర్థ నాయకత్వం వల్ల సాధ్యం అవుతోందన్నారు.