»Revanth Reddy Said Was A Part Of The Conspiracy To Attack Kotha Prabhakar Reddy And Guvvala Balaraju
Revanth Reddy: కొత్త ప్రభాకర్ రెడ్డి, గువ్వల బాలరాజుపై దాడి ఘటనలు కుట్రలో భాగం
అచ్చంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై జరిగిన దాడి ఘటన..అధికార పార్టీ డ్రామా అని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు సర్వసాధారణమని గుర్తు చేశారు. అంతేకాదు గతంలో జగన్ మోహన్ రెడ్డిపై కత్తితో దాడి చేయడం, మమతా బెనర్జీ కాలికి గాయం వంటి ఘటనలను ప్రస్తావించారు.
Revanth Reddy said was a part of the conspiracy to attack Kotha Prabhakar Reddy and Guvvala Balaraju
బీఆర్ఎస్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(Guvvala Balaraju)పై దాడి ఘటన తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. కేవలం పాపులారిటీ కోసమే కాంగ్రెస్ హింస రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తుంటే.. బీఆర్ఎస్ నేతలు సానుభూతి కోసం డ్రామాలు సృష్టిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. తాజాగా ఈ విషయంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) కూడా స్పందించారు. గువ్వల బాలరాజుపై జరిగిన దాడి డ్రామా అని రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు మామూలేనని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు. ఏపీలో కోడి కత్తితో దాడి ఘటన, బెంగాల్లో మమతా బెనర్జీ కాలికి గాయం ఘటనలే ఇందుకు ఉదాహరణ అని రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి(Kotha Prabhakar Reddy), గువ్వల బాలరాజులపై దాడులు కూడా కుట్రలో భాగమేనని విమర్శించారు.
బాలరాజు హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చేరగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు(KTR) ఆదివారం ఆయనను పరామర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో శనివారం రాత్రి ప్రత్యర్థి వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన బాలరాజు తనపై, బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ, ఆయన మద్దతుదారులు దాడి చేశారని ఆరోపించారు. వంశీకృష్ణ(vamshi krishna) తనపై రాయితో దాడి చేశారని మీడియా ప్రతినిధులతో అన్నారు.