Harish ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. కేటీఆర్‌ను సీఎం చేసిన ఓకేనట..?
కేటీఆర్ సీఎం పదవీ చేపట్టిన తనకు అభ్యంతరం లేదని మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీలో మాదిరిగా తమ పార్టీలో కుమ్ములాటలు ఉండవని తేల్చిచెప్పారు.
Harish Rao: తెలంగాణ గట్టు మీద రాజకీయాలు యమ రంజుగా సాగుతున్నాయి. నేతలు విమర్శలు- ప్రతి విమర్శలు పీక్‌కి చేరాయి. తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటే.. తమ పార్టీ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే సీఎం అభ్యర్థుల గురించి కూడా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ సీఎం అభ్యర్థుల కూడా మెల్లిగా చర్చ జరుగుతుంది.
కాంగ్రెస్ పార్టీ గురించి పక్కన పెడితే.. అధికార బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టిన కేసీఆర్ ముఖ్యమంత్రి పదవీ చేపడుతారని ఆ పార్టీ నేతలు బయటకు చెబుతున్నారు. కానీ కేటీఆర్‌కు సీఎం పదవీ అప్పజెప్పుతారని ఇన్నర్ టాక్.. దీనిపై మరో మంత్రి, కీలక నేత హరీశ్ రావు (Harish Rao) స్పందించారు. తమ పార్టీలో పదవుల కోసం కొట్లాటలు ఉండవని తెగేసి చెప్పారు.
వ్యక్తిత్వం గొప్పది
సీఎం కావాలని.. అధికారం కావాలని ఏ రోజు ఆలోచించలేదని హరీశ్ రావు (Harish Rao) స్పష్టంచేశారు. తన దృష్టిలో పదవుల కన్నా వ్యక్తిత్వం గొప్పదని తేల్చిచెప్పారు. బావమరిది కేటీఆర్ మంచి స్నేహితుడు అని.. తాను సీఎం పదవీ చేపట్టిన అంగీకరిస్తానని కుండబద్దలు కొట్టారు. అంటే తమ పార్టీ అధికారంలోకి రావాలే తప్ప.. సీఎం పోస్ట్ కోసం కొట్టుకోమని చెప్పేశారు. ఇదే జరిగితే ఆ పార్టీకి ప్లస్ కానుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో సిచుయేషన్ వేరు.. అందులో కనీసం ఓ ఐదారుగురు ముఖ్యమంత్రి పదవీ కోసం పోటీ పడుతున్నారు.
రాహుల్‌కు అవగాహన లేదు
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అవగాహన లేకుండా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత రెండు పంటలు వేస్తుంది నిజం కాదా అని అడిగారు. తమకు మంచి పేరు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఓర్చుకోవడం లేదని అంటున్నారు. ఆ పేరు చెడగొట్టాలనే లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ అంటున్నారని ధ్వజమెత్తారు. అలా అయితే కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్టుల్లో ఎంత కమీషన్ తీసుకున్నారని నిలదీశారు.