తెలంగాణలో అధికారమే లక్ష్యంగా టీ- కాంగ్రెస్ దూసుకుపోతుంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరికొన్ని రోజుల సమయం మాత్రం ఉండటంతో ఆరు గ్యారెంటీలు, డిక్లరేషన్లు, మేనిఫెస్టోతో ప్రచారం హోరెత్తిస్తోంది. ఈ క్రమంలో టీ- కాంగ్రెస్ ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీలను నియమించింది. ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్, కన్వీనర్‌గా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన లేడీ ఫైర్ బ్రాండ్ విజయశాంతిని నియమించ...
తెలంగాణలో పర్యాటకరంగానికి అపార అవకాశాలున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. కొత్త రిజర్వాయర్ల నిర్మాణంతో ఈ రంగంలో ఆకర్షణీయమైన అవకాశాలున్నాయన్నారు. తమ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే తనకు పర్యాటకశాఖ కేటాయించమని సీఎం కేసీఆర్‌ను అడుగుతానని చెప్పారు.
తెలంగాణలో ఎన్నికల వేళ మంత్రితోపాటు తిరుమలకు వెళ్లినందుకు ఇద్దరు అధికారులను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుతం మహబూబ్ నగర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినీతి చేసి దోచుకున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(rahul gandhi) వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు పగుళ్లు ఏర్పడినట్లు గుర్తు చేశారు. వీటికి ఎవరు బాధ్యత వహిస్తారని రాహుల్ కేసీఆర్ ను ప్రశ్నించారు. దీనిపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ పదవీ విరమణకు సిద్ధమని అంటున్నారని, ప్రజలు కూడా ఆయన్ను దించేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసిన సందర్భంగా ఈ మేరకు పేర్కొన్నారు. అంతేకాదు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు హామీలను వెంటనే అమలు చేస్తామన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.ప్రతి ఒక్కరికీ మేలు చేసేలా ఈ మేనిఫెస్టోని రూపొందించినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా కాంగ్రెస్ అభివర్ణించింది.
మంత్రి సత్యవతి రాథోడ్ కు మంగళ హారతితో బీఆర్ఎస్ మహిళలు స్వాగతం పలికారు. మంగళహారతి పళ్లెంలో రూ.4వేలను మంత్రి సత్యవతి రాథోడ్ వేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకే డబ్బులిచ్చారని ఎఫ్ఎస్‌టీ బృందం మంత్రిపై ఫిర్యాదు చేసింది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదింటి ఆడబిడ్డల పెళ్లికి రూ.1 లక్ష నగదుతో పాటు తులం బంగారం స్కీం అమలు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మెడ్చల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన కేసీఆర్, మల్లారెడ్డి కలిసి భూములను కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు.
క్షేత్రస్థాయి క్యాడర్ తోడు ఉండకపోవడంతో సనత్ నగర్ నియోజకవర్గంలో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ప్రచారం అర్ధాంతరంగా ఆగిపోయింది. జనం నుంచి స్పందన లేకపోవడం ఓ కారణం కాగా.. ఆ బస్తీల్లో వీధులు కూడా తెలియలేదు.
తెలంగాణలో నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరిగిందని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం(Chidambaram) తాజాగా పేర్కొన్నారు. దీంతోపాటు హైదరాబాద్లోనే గ్యాస్ ధర అత్యధికంగా ఉన్నట్లు గుర్తు చేశారు. మరోవైపు రాష్ట్రంలో అప్పులు కూడా స్థాయికి మంచి పెరిగినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ ప్రభుత్వంపై నిరాశతో ఉన్నట్లు చెప్పారు.
సొంత పార్టీ నేతలే తన వెనక గొయ్యి తవ్వుతున్నారని.. ఇప్పుడే కాదు 2018లో కూడా ఇలానే చేశారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అంటున్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత వారందరి సంగతి చెబుతానని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నేత, హుజురాబాద్ ప్రస్తుత ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా తాను ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేనని ఈటల అన్నారు. అంతేకాదు ప్రస్తుతం తన వద్ద ధైర్య లక్ష్మి మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాలు పలురకాలుగా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.