తెలంగాణలో రాజీనామా పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ(Congress party)కి మరో గట్టి షాక్ తగిలింది. బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ రేడియో జాకీ, యాంకర్ కత్తి కార్తీక (Kathi Karthika) బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దుబ్బాక (Dabbaka) ఉప ఎన్నికలో కార్తీక ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. గతేడాది జులైలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పి బీఆర్ఎస్లో చేరారు.
కాంగ్రెస్ నుంచి దుబ్బాక టికెట్ ను ఆశించారు కత్తి కార్తీక. ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో అసంతృప్తి ఉన్న ఆమె నిన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.గతంలో బీజేపీ (BJP)లో పార్టీలో ఉన్న కత్తి కార్తీక ఆ పార్టీకి రాజీనామా చేసి 2021లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దేశంలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర ‘భారత్ జోడో యాత్ర (Jodo Yatra)’ లో కత్తి కార్తీక కీలకంగా వ్యవహరించారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) తో కలిసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు కత్తి కార్తీక.