బాలీవుడ్ నటి సన్నీలియోన్ (Sunny Leone) యూపీ వారణాసిలో గంగాహారతికి హాజరయ్యారు. సంప్రదాయ ధరించి భక్తిశ్రద్దలతో పూజలు చేశారు.పింక్ డ్రస్, మెడలో దండతో ఉండటంతో అభిమానులు ఫిదాఅయ్యారు. ఆమె పండితులు పూజలు చేస్తుంటే ముకుళిత హస్తాలతో నిల్చున్నారు. ఆమెతోపాటు నటుడు అభిషేక్ (Abhishek) కూడా ఉన్నారు. సన్నీని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. సన్నీలియోన్, అభిషేక్ సింగ్ కలిసి చేసిన ‘థర్డ్ పార్టీ(Third party)’ మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సాంగుకు అభిషేక్ సింగ్ రాసి, పాడడమే కాకుండా కంపోజ్ చేశాడు. సన్నీలియోన్.. ప్రపంచవ్యాప్తంగా చిరపరిచితమైన పేరిది.
పోర్న్‌స్టార్‌గా కెరియర్ను ప్రారంభించి బాలీవుడ్(Bollywood)లో అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు. ప్రకాశవంతమైన వెలుగులతో గంగా నది అద్భుతమైన దృశ్యాలను ఆవిష్కరించే గంగా హారతి (Ganga Harati) మనలో, మన చుట్టూ ఉన్న గొప్ప దైవత్వాన్ని అనుభవించేలా చేస్తుంది. యుగాల నుండి పవిత్ర గంగా నదిని ఆరాధించకుండా ఏ రోజూ గడిచిపోలేదు. ప్రతి యాత్రికుడు జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన, తమ ప్రయాణాల జాబితాలో తప్పక చేర్చుకోవాల్సిన కార్యకలాపాలలో ఇది ఒకటి. ప్రత్యేకమైన గంగా హారతిని చూడాలనే కోరికతో వారణాసి నగరానికి అన్ని వర్గాల ప్రజలు వస్తుంటారు.