»Kashi Vishwanath Temple Dhoti Kurta For The Police In The Temple Where
Kashi Vishwanath Temple: ఆలయంలో పోలీసులకు ధోతీ-కుర్తా.. ఎక్కడంటే?
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అయిన వారణాసి కాశీ విశ్వనాథ ఆలయం వద్ద విధులు నిర్వర్తించే పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త డ్రెస్‌కోడ్ ప్రకటించింది. ఇకపై పోలీసులు ఖాకీ దుస్తుల్లో కాకుండా సంప్రదాయ దుస్తుల్లో విధులు నిర్వహిస్తారని వారణాసి పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ ఆదేశాలు జారీ చేశారు.
Kashi Vishwanath Temple: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అయిన వారణాసి కాశీ విశ్వనాథ ఆలయం వద్ద విధులు నిర్వర్తించే పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త డ్రెస్‌కోడ్ ప్రకటించింది. ఇకపై పోలీసులు ఖాకీ దుస్తుల్లో కాకుండా సంప్రదాయ దుస్తుల్లో విధులు నిర్వహిస్తారని వారణాసి పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ ఆదేశాలు జారీ చేశారు. అయితే విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు ధోతీ-కుర్తా, మెడలో రుద్రాక్ష మాలతో అర్చకుల వస్త్రధారణలో కనిపించారు. దీంతో ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు అర్చకుల మాదిరిగా డ్రెస్ కోడ్ ధరించాలని ఏ పోలీసు మ్యానువల్‌లో ఉంది. ఈ ఉత్తర్వులు ఇచ్చిన వాళ్లను వెంటనే సస్పెండ్ చేయాలి.
దీన్ని అవకాశంగా తీసుకుని ఎవరైనా మోసాలకు పాల్పడి, ప్రజలను దోపిడీ చేస్తే? ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. అలాగే సోషల్ మీడియాలో కూడా యోగి ప్రభుత్వంపై విమర్శలు ఎదురయ్యాయి. దీనికి కమిషనర్ మోహిత్ అగర్వాల్ మాత్రం సమర్థించుకున్నారు. ఆలయాల్లో విధి నిర్వహణ మిగతా ప్రాంతాలతో పోలిస్తే విభిన్నంగా ఉంటుంది. రద్దీ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించదు. అయితే భక్తులకు త్వరగా దర్శనం కల్పించే క్రమంలో కొన్నిసార్లు పోలీసులు వ్యవహరించే తీరు ప్రజలకు బాధ కలిగిస్తుంది. అదే వాళ్లు అర్చకులుగా కనిపిస్తే భక్తులు సానుకూల కోణంలో ఆలోచించే అవకాశం ఉంటుందని అందుకే డ్రెస్‌కోడ్ మార్చామని తెలిపారు.