»Employee Advertisement For Room Sharing Fraud In The Name Of Cohabitation
Hyderabad : రూమ్ షేరింగ్ కోసం ఉద్యోగి ప్రకటన..సహజీవనం పేరిట మోసం
సహజీవనం పేరిట మోసం చేసిన ఘటనపై కేసు నమోదైంది. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి రూం షేర్ చేసుకున్న మహిళ తాను వేశ్యనని చెప్పింది.. జీర్ణించుకోలేని అతడు గది ఖాళీ చేయమన్నాడు.
సహజీవనం పేరిట మోసం చేసిన ఘటనపై హైదరాబాద్ (Hyderabad) మధురానగర్‌లో కేసు నమోదైంది. సాఫ్ట్వేర్ ఉద్యోగి సి.కిరణ్‌కుమార్ వెంగళ్రావునగర్ శ్రీకృష్ణానగర్‌లో ఏడాది క్రితం ఓ రూం రెంట్ తీసుకుని ఉండేవాడు. తనతో పాటు రూమ్ షేర్ చేసుకోవడానికి ఆసక్తిగల వారు సంప్రదించాలని ఓఎల్ఎక్స్(OLX)లో ప్రకటన ఇచ్చాడు. ఓ మహిళ ఆసక్తి చూపి, గదిలో చేరింది. అనంతరం కూకట్‌పల్లికి మకాం మారారు. అయితే, తాను వేశ్యనని (Prostitute) ఆమె చెప్పడంతో గది ఖాళీ చేయమని కోరారు.
ఆమె నిరాకరించడంతో పాటు తాము సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియా(Social media)లో వైరల్ చేస్తానంటూ బెదిరించింది. అంతేకాకుండా తనపై లైంగిక దాడిచేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబరాబాద్ షీ బృందాన్ని(She team) ఆశ్రయించింది. ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత అతడి నుంచి రూ.4.7లక్షలు పరిహారం కింద తీసుకుంది. అనంతరం సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్ చేయడంతో కిరణ్‌కుమార్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వాటిని తొలగించారు.మరోసారి ఇద్దరు వ్యక్తులతో అతడిపై దాడిచేయించింది. ఈ మేరకు బుధవారం రాత్రి బాధితుడు పోలీసులకు కంప్లైంట్ చేశాడు.