»Assembly Election Polling Has Started In Chhattisgarh And Madhya Pradesh
Assembly election : ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో మొదలైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు మధ్యప్రదేశ్ పోలింగ్ జరగనుంది. ఒకే దశలో జరగనున్న పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
నేడు మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 230 శాసనసభ స్థానాలకు ఒకే విడతలో ఓటింగ్ నిర్వహించనున్నారు. వివిధ పార్టీల తరఫున ఈ రాష్ట్రంలో 2,534 మంది అభ్యర్థులు బరిలో నిలవగా వారిలో 252 మహిళా అభ్యర్థులు ఉన్నారు. ప్రధాన పోటీ మాత్రం బీజేపీ (BJP), కాంగ్రెస్ మధ్యే కనిపిస్తోంది. మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ.. ఈసారి పూర్తి మెజార్టీతో మధ్యప్రదేశ్‌లో జెండా పాతాలని కాంగ్రెస్ (Congress) ఉవ్విళ్లూరుతున్నాయి. నేడు ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఛత్తీస్ గడ్ (Chhattisgarh)లో రెండో విడతలో భాగంగా 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది.
అయితే నక్సల్స్ (Naxals) ప్రభావిత ప్రాంతాల్లో ఓటింగ్ ఉదయం 7 గంటలకే మొదలయ్యి మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్థానాలు ఉండగా 47 ఎస్టీ, 35 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 64,626 పోలింగ్ స్టేషన్లు ఉండగా 2,533 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అభ్యర్థుల్లో 2,280 మంది పురుషులు, 252 మంది మహిళలు, ఒకరు థర్డ్ జెండర్ వ్యక్తి ఉన్నారని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (Electoral Officer) వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం చేశాయి. కేంద్ర, రాష్ట్ర పథకాలే తమను తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయని బీజేపీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని, శివరాజ్‌సింగ్ చౌహాన్ (Shivraj Singh Chauhan)పై అవినీతి ఆరోపణలు తమకు అనుకూలంగా మారతాయని కాంగ్రెస్ నేతలు ధీమాతో ఉన్నారు. మధ్యప్రదేశ్ ఎన్నికల బరిలో ఉన్న ప్రముఖుల్లో ప్రధానంగా బుద్నీ నుంచి సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, డిమ్నీ నుంచి మాజీ కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, నర్సింగపూర్‌లో ప్రహ్లాద్ సింగ్ పటేల్, నివాస్‌లో ఫగ్గన్ సింగ్ కులస్తే, చింద్వారా మాజీ సీఎం, కాంగ్రెస్ దిగ్గజం కమల్‌నాథ్ (Kamal Nath) పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ ఇండోర్-1, బీజేపీ ఎంపీలు రాకేష్ సింగ్, గణేష్ సింగ్, మరియు రితీ పాఠక్ కూడా ఎన్నికల బరిలో ఉండడం విశేషం.