AP: మాజీ సీఎం జగన్‌పై మంత్రి రాంనారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తుఫాన్‌ను ఎదుర్కోవడంలో విఫలమయ్యారని ప్రభుత్వంపై జగన్ పదేపదే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై అసెంబ్లీలో చర్చ పెడదాం.. సిద్ధమా? అని ప్రశ్నించారు. ఉనికిని కాపాడుకునేందుకు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రజలు తమను మర్చిపోతున్నారని వైసీపీ భయపడుతోందని ఎద్దేవా చేశారు.