తృణమూల్ కాంగ్రెస్(TMC) ఎంపీ కల్యాణ్ బెనర్జీ సైబర్ దాడి బారినపడ్డారు. సైబర్ నేరగాళ్లు కల్యాణ్ బెనర్జీకి సంబంధించిన నకిలీ కేవైసీ(KYC) వివరాలను ఉపయోగించి ఆయన బ్యాంకు అకౌంట్ నుంచి రూ.56 లక్షలు దోచుకున్నారు. తాను సైబర్ దాడి బారిన పడినట్లు ఎంపీ కల్యాణ్ బెనర్జీ ధృవీకరించారు. ఈ భారీ మొత్తాన్ని దోచుకున్న సైబర్ నేరగాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.