NLG: మాడుగులపల్లి మండలం కన్నేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బేటీ బచావో.. బేటీ పఢావో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మీ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేసుకోవడం చట్టరీత్యా నేరమన్నారు. అలాగే, అక్రమ దత్తత తీసుకోవడం చట్ట విరుద్ధమని, అక్రమ దత్తత తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.