ELR: మండవల్లి మండలంలో భోగీ సందర్భంగా బుధవారం కోడిపందేలు నిర్వహించారు. చింతపాడు, చావలిపాడు, ఉనికిలి, లింగాల తదితర గ్రామాల్లో బరులు ఏర్పాటు చేయగా పందెం రాయుళ్లు తరలివచ్చారు. చింతపాడులో ఏర్పాటు చేసిన బరిని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ప్రారంభించారు. పండుగ సంప్రదాయం పేరిట పలు గ్రామాల్లో నిర్వహించిన ఈ పోటీలను తిలకించారు.