MHBD: మీడియాపై ప్రభుత్వ దాడులు సిగ్గుచేటని ఐజేయూ జాతీయ కమిటీ సభ్యులు దూలం శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఓ మీడియా సంస్థ ప్రతినిధులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం తొర్రూరు డివిజన్ కేంద్రంలో జర్నలిస్టులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. మీడియా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు అని, మీడియా ప్రతినిధులను అరెస్టు చేయించడం అప్రజాస్వామికమన్నారు.