HYD: నగరంలో మరోసారి వాయు నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరింది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతోంది. డబుల్ డిజిట్లో ఉండే AQI గురువారం తెల్లవారుజామున గాజులరామారంలో 221కి చేరింది. శ్వాసకోశ సమస్యలు, సైనసైటిస్ ఉన్నవారు మాస్కులు ధరించి, జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.