E.G: అనపర్తి గ్రామ దేవత వీరుల్లమ్మ జాతర మహోత్సవాలు గురువారం నుంచి నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అలాగే 16, 17, 18వ తేదీలలో అమ్మవారి తీర్థం జరుగుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసామన్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలియజేశారు.