»Campaign Of The Candidate Who Did Not Know The Streets
Campaign: వీధులు తెలియక ఆగిన అభ్యర్థి ప్రచారం.. ఎక్కడంటే..?
క్షేత్రస్థాయి క్యాడర్ తోడు ఉండకపోవడంతో సనత్ నగర్ నియోజకవర్గంలో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ప్రచారం అర్ధాంతరంగా ఆగిపోయింది. జనం నుంచి స్పందన లేకపోవడం ఓ కారణం కాగా.. ఆ బస్తీల్లో వీధులు కూడా తెలియలేదు.
Campaign Of The Candidate Who Did Not Know The Streets
Campaign: అసలే ఎన్నికల సమయం.. మరో 15 రోజుల్లో పోలింగ్.. జనాలను కలిసేందుకు అభ్యర్థుల పాట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రణాళిక ప్రకారం వెళితేనే అందరినీ కలుసుకోవచ్చు. సనత్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థికి (congress candidate) మాత్రం చుక్కెదురైంది. ఏం జరిగిందో తెలుసుకుందాం. పదండి.
ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కోట నీలిమ (neelima) బరిలో ఉన్నారు. బుధవారం బన్సిలాల్ పేట డివిజన్ పరిధిలో గల వెస్లీ చర్చ్, ఈశ్వరమ్మ బస్తీలో పాదయాత్ర చేశారు. స్థానిక బూత్ కమిటీ సభ్యులు మాత్రం అక్కడ లేరు. ఇంటింటికి ప్రచారం చేస్తోన్న సమయంలో వారిని స్థానిక ప్రజలు గుర్తు పట్ట లేదు. ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. జనాల హడావిడి లేదు.
దానిపైనే కోపంతో ఉన్నారు.. తర్వాత ప్రచారం చేసే సమయంలో ఏ వైపు వెళ్లాలో తెలియలేదు. నేతలు అందరూ గందరగోళానికి గురయ్యారు. పార్టీ నేతలపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రచార షెడ్యూల్ ముందే తెలుసు అని.. బూత్ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో మండిపడ్డారు. అక్కడి నుంచి తూతూ మంత్రంగా ప్రచారం ముగించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇలా అభ్యర్థి.. వీధులు తెలియక అర్ధాంతరంగా ప్రచారం ముగించుకున్నారు. సమయం లేదు.. క్షేత్రస్థాయిలో క్యాడర్ ఇలా ఉండటంతో ఇబ్బందులు తప్పడం లేదు. సో.. మిగిలిన బస్తీలపై అభ్యర్థిని నీలిమ దృష్టి సారించాల్సి ఉంది. లేదంటే ఫలితం తారుమారు అయ్యే అవకాశం ఉంటుంది.