ADB: జిల్లాలో నవజాత శిశు మరణాలను తగ్గించే దిశగా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజార్షి షా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆరోగ్య శాఖ, వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు.