బీఆర్ఎస్, బీజేపీపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలు, నేతలు దుబ్బాకకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని కోరారు.
తెలంగాణలో ఈనెల 30న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో నిన్నటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఈనెల 27న పూర్తి కానుంది. అయితే మొదటిరోజు 9 వేలకుపైగా ఈ ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే వీటని సీనియర్ సిటిజన్లతోపాటు అత్యవసర సేవల 13 విభాగాల ఉద్యోగులు కూడా వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.
దేశాని ఇందిరాగాంధీ చేసిన సంక్షేమం ఏం లేదన్న కేసీఆర్ మాటలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదని తెలిపారు. మోదీ, కేసీఆర్ ఒకటేనని అన్నారు.
మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీపై సంతోష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ పోలీస్ అధికారితో దురుసుగా వ్యవహరించారని కేసు ఫైల్ చేశారు. పోలీసుల తీరును అక్బర్ సోదరుడు అసదుద్దీన్ ఒవైసీ తప్పు పట్టారు.
గెలుపుకోసం రాజకీయ నాయకులు ఇచ్చే హామీల వల్ల దేశం నాశనం అవుతుందని జయప్రకాశ్ నారాయణ పేర్కొన్నారు. పెన్షన్ల వల్ల రాష్ట్రాలకు ఆర్థికంగా ఎంత నష్టం జరుగుతుందో వివరించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు గెలిస్తే గొప్ప అని మంత్రి హరీశ్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ఆ పార్టీ నేతలు మాత్రం అధికారం చేపడుతామని గొప్పలు పోతున్నారని మండిపడ్డారు. గెలిస్తే ఒక సీటు గెలవొచ్చన్నారు.
కర్ణాటకలో 5 గ్యారెంటీలు అమలు కావడం లేదని కర్ణాటక బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. వారి మాటలను నమ్మొద్దని కోరారు.
ఖమ్మం నియోజకవర్గంలో ఎన్నికల హీట్ పెరిగింది. బీఆర్ఎస్ అరాచకపాలను అంతం చేసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నాడు. అంతే కాదు ఈ ఎన్నికల కోసం కోట్లల్లో బెట్టింగులు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ ముస్లిం సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముస్లింలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని తెలిపింది.
మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ నేతల బృందం సీఈసీకి కంప్లైంట్ చేసింది. ఎన్నికల నిబంధనలను అతిక్రమించినందున కేటీఆర్‌పై 3 రోజుల ప్రచారం నిషేధం విధించాలని కోరింది.