మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీపై సంతోష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ పోలీస్ అధికారితో దురుసుగా వ్యవహరించారని కేసు ఫైల్ చేశారు. పోలీసుల తీరును అక్బర్ సోదరుడు అసదుద్దీన్ ఒవైసీ తప్పు పట్టారు.
Akbaruddin : మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై (Akbaruddin) పోలీసులు కేసు నమోదు చేశారు. రాత్రి 10 గంటల్లోపు ఎన్నికల ప్రచారం పూర్తి చేయాల్సి ఉంటుంది. మంగళవారం లలితాబాగ్‌లో ప్రచారం నిర్వహించే సమయంలో అక్బరుద్దీన్ చేయలేదు. దీంతో సంతోష్ నగర్ పోలీసులతో వాగ్వివాదం జరిగింది. ఓ పోలీస్ అధికారితో అక్బర్ (Akbar)దురుసుగా ప్రవర్తించాడని తెలిసింది. దీంతో సంతోష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. విధులను అడ్డకోవడం, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని డీసీపీ రోహిత్ రాజు తెలిపారు.
తన వద్ద వాచీ ఉందని.. ఇంకా 5 నిమిషాల సమయం ఉందన్నారు. తనను ఆపే వ్యక్తి ఇంకా పుట్టలేదని చెప్పారు. అవసరమైతే ఇంకా మాట్లాడతానని.. ఎలా అడ్డుకుంటారో చూస్తానని సవాల్ చేశారు. తాను కనుసైగ చేస్తే పరుగులు తీయాల్సి వస్తోందని వార్నింగ్ ఇచ్చారు. కత్తిపోట్లు, బుల్లెట్ గాయాలు అయినంత మాత్రానా తన పని అయిపోలేదని అన్నారు. అక్బర్‌తో పోటీ పడేందుకు వస్తున్నారు.. రానీయండి.. ఎలా గెలుస్తారో చూద్దాం అన్నారు.
ఇదే అంశంపై అక్బర్ (Akbar) సోదరుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. పోలీసుల తీరు సరిగా లేదన్నారు. రాత్రి 10 దాటితే ప్రచారం నిర్వహిస్తే తప్పు.. 9.55 నిమిషాలకు ప్రచారం ఆపివేయాలని ఎలా చెబుతారని అడిగారు. 5 నిమిషాల సమయం ఉన్న పోడియంపైకి రావడం సరికాదన్నారు. 5 నిమిషాల ముందు ప్రసంగం ఆపాలని ఏ చట్టం చెప్పిందని అడిగారు.