బర్రెలక్క శిరీష తరఫున మాజీ సీబీఐ ఆఫీసర్ జేడీ లక్ష్మీనారాయణ కొల్లాపూర్‌లో ప్రచారం నిర్వహించారు. శిరీష ఎన్నికల్లో పోటీచేయడాన్ని అభినందించారు. రాజకీయాల్లోకి బర్రెలక్కలాంటి యువత రావాలని కోరారు. ఈల గుర్తుకు ఓటు వెయ్యాలని పిలుపునిచ్చారు.
మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ ఇంట్లో కేసీఆర్ వేల కోట్లు దాచాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనిపై ఫిర్యాదు ఇవ్వడానికి రాష్ట్ర ఎన్నికల అధికారికి వందసార్లు కాల్ చేసిన లిఫ్ట్ చేయలేదని మండిపడ్డారు. బీజేపీ పార్టీ కేసీఆర్ కనుసైగలతో నడుస్తుందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియా పెట్రేగిపోయిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. గత పదేళ్లలో అభివృద్ధి పడకేసిందని విమర్శించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు పంపించింది. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దంటూ హెచ్చరించింది. ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తిదాడి విషయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ నోటీసులు ఇచ్చింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ నేడు హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే శుభవార్తలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తమ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కాలం చెల్లిందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు పాలన జరగలేదని విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా గెలవడని మంత్రి హరీశ్ రావు అన్నారు. కానీ తాను సీఎం అవుతానని కామెంట్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. అతనే కాదు ఓ 10 మంది వరకు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని వివరించారు.