»Jd Lakshminarayana Campaigned For Barrelakka In Kolhapur
JD Lakshminarayana: బర్రెలక్క తరఫున కొల్లాపూర్‌లో జేడీ లక్ష్మీనారాయణ ప్రచారం
బర్రెలక్క శిరీష తరఫున మాజీ సీబీఐ ఆఫీసర్ జేడీ లక్ష్మీనారాయణ కొల్లాపూర్‌లో ప్రచారం నిర్వహించారు. శిరీష ఎన్నికల్లో పోటీచేయడాన్ని అభినందించారు. రాజకీయాల్లోకి బర్రెలక్కలాంటి యువత రావాలని కోరారు. ఈల గుర్తుకు ఓటు వెయ్యాలని పిలుపునిచ్చారు.
JD Lakshminarayana campaigned for Barrelakka in Kolhapur
JD Lakshminarayana: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచరాలు జోరందుకున్నాయి. కొల్లాపూర్(Kollapur) స్వతంత్ర అభ్యర్థి(Independent contender) బర్రెలక్క(శిరీష)కు రాష్ట్రవ్యాప్తంగాా మద్దతు లభిస్తుంది. ఈ నేపథ్యంలో మాజీ సీబీఐ అధికారి జేడీ లక్ష్మీనారాయణ శిరీష(Karne Shireesha) తరఫున ప్రచారం నిర్వహించారు. కొల్లపూర్ నియోజకవర్గానికి స్వయంగా వెళ్లి బర్రెలక్క(Barrelakka)ను కలుసుకున్నారు. ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో శనివారం నిర్వహించిన ప్రచారకార్యక్రమంలో పాల్గొన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలన్నారు. పార్టీలను చూసి కాదు అభ్యర్థులను చూసి ఓట్లు వేయాలని, ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడటానికి శిరీష లాంటి వారే కావాలన్నారు. శిరీష ఎమ్మెల్యే అయితే మొదట ఆనందపడేది తానే అని తెలిపారు. నేడు శిరీష ఎందరికో రోల్ మోడల్ అని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్నో పార్టీలు, ఎంతో మంది పనిచేశారని, ఇకపై కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్నారు.
చదవండి:Revanth Reddy: మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో రూ.కోట్లు
బర్రెలక్కకు మద్దతుగా చాలా మంది ప్రముఖులు వస్తున్నారని, యానాం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మల్లాడి కృష్ణారావు సోమవారం కొల్లాపూర్‌కు రానున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో పోల్ మేనేజ్మెంట్ ఎంతో ముఖ్యమైన్నారు. శిరీష ఈ స్థాయికి రావడానికి కారణం సోషల్ మీడియా అని, దానిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని తెలిపారు. తనకు ఈల గుర్తు రావడం బాగుందని, గెలిచి అసెంబ్లీలో ప్రజల సమస్యలపై శిరీష మాట్లాడలని జేడీ(JD Lakshminarayana) అన్నారు.