Andhrapradesh: పవన్ కంటే బర్రెలక్క బెటర్: సీఎం జగన్
పలాస బహిరంగ సభలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్‌పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన బర్రెలక్క కంటే జనసేన పార్టీకి తక్కువ ఓట్లు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్యాకేజీ స్టార్ డైలాగులు వైసీపీని ఏం చేయలేవని అన్నారు.
తెలంగాణ ఎన్నికల (Telangana Elections) సమయంలో బర్రెలక్క (Barrelakka) పేరు మారుమోగిపోయింది. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ (Ap Politics)లో కూడా ఆమె పేరు హాట్ టాపిక్‌గా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటే బర్రెలక్క ఎంతో బెటర్ అని సీఎం జగన్ (Cm Jagan) విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం వైసీపీ నేతలు బర్రెలక్క పేరును ప్రధాన ఆయుధంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా జరిగిన పలాస (Palasa) బహిరంగ సభలో సీఎం జగన్ పవన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలో జనసేన పార్టీ (Janasena Party) పోటీ చేస్తే కనీసం బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా తెచ్చుకోలేదని ఎద్దేవా చేశారు.
తెలంగాణ లో జనసేన కు వచ్చిన డిపాజిట్లు మీద జగనన్న పంచ్ లు😂🤣🔥
చంద్రబాబు (Chandrababu) దత్తపుత్రుడిని యాక్టర్‌గా పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నారన్నారు. తెలంగాణలో ఆ దత్తపుత్రుడు పోటీ చేస్తే ఏం జరిగిందో అందరికీ తెలుసని, తెలంగాణ ఎన్నికల సమయంలో పవన్ వ్యాఖ్యలు వింటే అందరికీ ఆశ్చర్యమేసిందన్నారు. భారీ డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదన్నారు. ఆంధ్రా పాలకులకు ఆ ప్యాకేజీ స్టార్ చుక్కలు చూపించారని, అనేక డైలాగులను ఆ మ్యారేజ్ స్టార్ చెప్పారని పవన్ (Pawan Kalyan) పేరును ప్రస్తావించకుండా సీఎం జగన్ విమర్శలు గుప్పించారు.
పాదయాత్రలో తాను ఉద్దానం ప్రజల బాధను చూశానన్నారు. తాను ఇచ్చిన మాట ప్రకారంగానే కిడ్నీ రీసెర్చ్ సెంటర్ (Kidney Research Centre)ను తీసుకొచ్చినట్లు తెలిపారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తోన్నట్లు గుర్తు చేశారు. త్వరలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేసే వ్యవస్థను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఎన్నికలు వచ్చేసరికి ఎత్తులు, పొత్తులు, జిత్తుల మీద చంద్రబాబు ఆధారపడతారని, విశాఖను పరిపాలన రాజధానిని చేస్తామంటే అడ్డుపడుతున్నారని సీఎం జగన్ విమర్శలు చేశారు.