Congress కట్టించిన స్కూళ్లు, కాలేజీల్లో కేసీఆర్ చదివారు: రాహుల్ గాంధీ
తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియా పెట్రేగిపోయిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. గత పదేళ్లలో అభివృద్ధి పడకేసిందని విమర్శించారు.
Rahul Gandhi: రాజ్యాంగం, పార్లమెంటరీ సిస్టం.. సోనియా గాంధీ వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. బోధన్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అవినీతి పాలన వల్ల తెలంగాణ నష్టపోయిందని తెలిపారు. ఆత్మ బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ కుటుంబ పాలనకు సొంతం అయ్యిందని మండిపడ్డారు. యువత కలలు, ఆశయాలను బీఆర్ఎస్ పార్టీ నాశనం చేసిందని విరుచుకుపడ్డారు.
తెలంగాణలో ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియా పెరిగిపోయిందని రాహుల్ గాంధీ (Rahul) గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని వివరించారు. దొరల పాలనను అంతం చేసి ప్రజా పాలనను తెచ్చుకోవాలని కోరారు. బీఆర్ఎస్, బీజేపీ హయాంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1200కు పెరిగిందని మండిపడ్డారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ఆ సామాజిక వర్గానికి ఖర్చు చేయడం లేదన్నారు.
పేదల గురించి తమ పార్టీ ఆలోచిస్తోందని.. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని స్పష్టంచేశారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ స్కూళ్లు, కాలేజీలు, ప్రాజెక్టులు నిర్మించలేదా అని అడిగారు. సీఎం కేసీఆర్ ఆ స్కూల్, కాలేజీల్లో చదువుకున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దింది తమ పార్టీయేనని స్పష్టంచేశారు.