Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో ప్రచార పర్వం ఊపందుకుంది. సీఎం కేసీఆర్పై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శలు గుప్పించారు. కేసీఆర్ బక్కోడు కాదు భూ బకాసురుడు అని విమర్శించారు. ఫామ్ హౌస్లో పడుకునే కుంభకర్ణుడు అని విమర్శించారు. లక్ష కోట్ల ప్రజాధనం దోచుకున్న దొంగ అని మండిపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం అన్నారు. ఆ వెంటనే కేసీఆర్కు చర్లపల్లిలో డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తానని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు నమ్మకం లేదన్నారు. ప్రజల మూడ్ చూస్తే ఆ విషయం తెలుస్తోందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం.. గత ప్రభుత్వం చేసిన అవినీతిపై చర్యలు తీసుకోవడం పక్కా అని చెప్పారు. మరో 5 రోజుల్లో ప్రచారం ముగియనుంది. ఓటర్లను ఆకట్టుకునే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. ఊరు, వాడ, పల్లె, పట్టణం అనే తేడా తెలియకుండా ప్రచారం చేస్తున్నారు.