»Jaggareddy Will Not Win But Will Become Cm Harish Rao
Jaggareddy గెలవడు కానీ సీఎం అవుతాడట: హరీశ్ రావు
వచ్చే ఎన్నికల్లో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా గెలవడని మంత్రి హరీశ్ రావు అన్నారు. కానీ తాను సీఎం అవుతానని కామెంట్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. అతనే కాదు ఓ 10 మంది వరకు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని వివరించారు.
Jaggareddy will not win but will become CM: Harish Rao
Harish Rao: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం హోరెత్తింది. సంగారెడ్డిలో మంత్రి హరీశ్ రావు (Harish Rao) ప్రచారం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్య ఉన్నారని వివరించారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఇచ్చామని తెలిపారు. వచ్చే టర్మ్‌లో సంగారెడ్డి, సదాశివపేటలో మైనార్టీలకు షాదీఖానా నిర్మిస్తామని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ పార్టీలో 10 మంది సీఎం అభ్యర్థులు ఉన్నారని మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. జగ్గారెడ్డి కూడా ముఖ్యమంత్రి అవుతానని అంటారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన గెలవడని.. చెప్పారు. జగ్గారెడ్డే కాదు ఓ 10 మంది వరకు సీఎం అభ్యర్థులు ఉంటారని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీలో వారికి వారికి కొట్టుకోవడమే తప్ప.. ప్రజలకు మేలు చేయడం ఉండదన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. కర్ఫ్యూ లేని తెలంగాణను చూశామని వివరించారు. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. షాదీ ముబారక్ పథకం మైనార్టీల పాలిట వరంగా మారుతోందని తెలిపారు. సదాశివపేటలో కబరిస్తాన్ కోసం 5 ఎకరాల భూమి ఇచ్చామని పేర్కొన్నారు. మైనార్టీ విద్యార్థులకు పోషకాహారం అందిస్తున్నామని వెల్లడించారు.