High Court Order Police For The Protection Of Barrelakka
Barrelakka: బర్రెలక్కగా (Barrelakka) గుర్తింపు పొందిన శిరీష (shirisha) కొల్లాపూర్ అసెంబ్లీ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. తనను గెలిపించాలని వయోజనులను కోరుతున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలిస్తే ఏం చేస్తానంటే.. అంటూ మేనిఫెస్టో (manifesto) రిలీజ్ చేశారు. ఆమె ఏం చేస్తారో చుద్దాం పదండి.
నిరుద్యోగుల కోసం ప్రత్యేక కోర్సు, ఉచితంగా ట్రైనింగ్ ఇప్పించేందుకు అసెంబ్లీలో పోరాటం చేస్తానని చెబుతున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే.. తన ఫైట్ కొనసాగుతోందని స్పష్టంచేశారు. నిరుద్యోగంపై అసెంబ్లీలో ప్రశ్నలు వేస్తానని చెప్పారు. ఆర్టికల్ 41 ప్రకారం నిరుద్యోగులకు అందాల్సిన హక్కుల కోసం పోరాటం చేస్తానని స్పష్టంచేశారు.
ప్రతీ ఊరిలో రోడ్లు, పేదవారికి ఇళ్లు నిర్మిస్తానని చెబుతున్నారు. ఉచిత విద్య, వైద్యం కోసం కృషి చేస్తానని స్పష్టంచేశారు. ఉన్నత చదువు చదివే వారికి ఉచితంగా కోచింగ్ ఇస్తానని చెబుతున్నారు. తనలాగా మరొకరు కాకుడదు అంటున్నారు. మరి బర్రెలక్క మేనిఫెస్టో చూసి ప్రజలు ఓటు వేస్తారో చూడాలి. గెలవడం, గెలవకపోవడం తర్వాత.. ఆమె ఓట్లు చీల్చుతుందని ప్రధాన పార్టీ నేతల్లో భయం ఉంది. దీంతో వారు ప్రచారాన్ని మరింత స్పీడప్ చేశారు.