Congress Leader Priyanka Gandhi Dance At Road Show
Priyanka: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక వచ్చే గురువారం జరగనుంది. ప్రజలను కలుసుకునేందుకు తక్కువ సమయం ఉంది. సభలు, సమావేశాలు, రోడ్ షోలతో నేతలు హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ (Priyanka) ఖమ్మం జిల్లాలో పర్యటించారు. పాలేరు, ఖమ్మం, మధిరలో పర్యటన కొనసాగింది.
ముందుగా ఖమ్మంలో ప్రియాంక గాంధీ రోడ్ సో చేశారు. ప్రచార రథంపై పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇతర నేతలు ఉన్నారు. లంబాడి మహిళలు కూడా ఉన్నారు. ఓ పాట వేయగా లంబాడి మహిళలతో కలిసి ప్రియాంక డ్యాన్స్ చేశారు. పాటకు అనుగుణంగా చేతులు ఊపుతూ ఉత్సాహాంగా స్టెప్పులు వేశారు. వెనక నుంచి చప్పట్లు కొడుతూ పొంగులేటి ఎంకరేజ్ చేశారు. ఆ లంబాడి మహిళలు కూడా జోరుగా కాలు కదిపారు.
ప్రియాంక డ్యాన్స్ చేస్తున్నంత సేపు కార్యకర్తలు విజిల్స్ వేసి హోరెత్తించారు. అరుపులతో ఆ ప్రాంతం హోరెత్తింది. ఆ తర్వాత మధిర, పాలేరులో ప్రియాంక మాట్లాడారు. తెలంగాణ ఇచ్చింది సోనియా అని.. కానీ ఇక్కడ గడీల పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. ప్రజల ఆకాంక్షల మేరకు పాలన జరగడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాలని కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని పేర్కొన్నారు.