»Money In Mangalaharathi Plate Case Registered Against Minister Satyavathi
Minister Satyavathi : మంగళహారతి పళ్లెంలో డబ్బులు.. మంత్రి సత్యవతి పై కేసు నమోదు
మంత్రి సత్యవతి రాథోడ్ కు మంగళ హారతితో బీఆర్ఎస్ మహిళలు స్వాగతం పలికారు. మంగళహారతి పళ్లెంలో రూ.4వేలను మంత్రి సత్యవతి రాథోడ్ వేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకే డబ్బులిచ్చారని ఎఫ్ఎస్టీ బృందం మంత్రిపై ఫిర్యాదు చేసింది.
తెలంగాణ మంత్రి సత్యవతి (Minister Satyavathy) రాథోడ్‌పై కేసు నమోదైంది. ఇటీవల మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ తరపున కొంగరగిద్ద గ్రామంలో మంత్రి ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో మహిళ కార్యకర్తలు హారతి ఇవ్వగా ఆ పళ్లెంలో ఆమె 4 వేలు రూపాయలు వేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకే డబ్బులిచ్చారని ఎఫ్ఎస్టీ బృందం (FST team) మంత్రిపై ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం జోరందుకుంది. అయితే ప్రచారం చేస్తుండగా మంత్రి సత్యవతి రాథోడ్ చేసిన ఓ పని ఆమెను చిక్కుల్లో పడేసింది.ఎన్నికల నియమావళిని ఉల్లఘించారంటూ మంత్రిపై కేసు ఫైల్ (Case file) అయ్యింది. మంత్రి రాథోడ్‌పై ఎన్నికల నిబంధన ఉల్లంఘన కింద 171-ఈ,171-హెచ్ ఐపీసీ ఆర్/డబ్ల్యూ 188 ఐఓసీ సెక్షన్ల కింద గూడూరు పోలీసులు కేసు నమోదు చేశారు.