మహబూబాబాద్ జిల్లా (Mahbubabad District) బార్ షాప్ యాజమానులు సీఎం కేసీఆర్(CM KCR)కు వినూత్నంగా ధన్యవాదలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఫోటో ముందు బాటిళ్లు ఉంచి దణ్ణం పెట్టి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ చల్లగా ఉండాలంటూ కోరుకున్నారు. బార్ షాపుల్లో 90 ఎం.ఎల్, క్వార్టర్, ఆఫ్ బాటిళ్లకు అనుమతి ఇవ్వడంతో వారు ఈ విధంగా అభిమానం చాటుకున్నారు.. ప్రస్తుతం ఆ వీడియో వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతోంది. కృతజ్ఞతను ప్రదర్శించడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్లైల్. తమకున్నంతలో కొందరు చేస్తే.. ఇంకొందరు మాత్రం అతికి పోతుంటారు. వైన్ షాపుల్లో మాత్రమే అందుబాటులో ఉండే లిక్కర్ (Liquor) క్వార్టర్, హాఫ్ బాటిళ్లు ఇకపై బార్లలోనూ లభించనున్నాయి.. దీని కోసం ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ (Excise Department) నిబంధనల్లో మార్పు తీసుకొచ్చింది.
ఇందులో బార్లకు కూడా ఆర్థిక ఊతం అందించేలా పలు నిబంధలను సవరించింది. కరోనా తరువాత ఆర్థిసంక్షోభంలో ఉన్న రాష్ట్రంలోని 1,172 బార్లు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో నిబంధనల్లో మార్పులు చేసినట్టు తెలుస్తోంది.అందులో భాగంగా బార్ల లైసెన్సింగ్ (Licensing of bars) విధానాన్ని కూడా సులభం చేసింది. అలాగే బ్యాంకు గ్యారెంటీల తగ్గింపు, లైసెన్స్ రుసుము చెల్లింపుల్లో వెసులుబాటు వంటి చర్యలు తీసుకుంది. వీటికి సంబంధించిన ఉత్తర్వులు అతి త్వరలోనే వెలువడే అవకాశం కనిపిస్తోంది. కొత్త ఉత్తర్వుల ప్రకారం.. బార్ అండ్ రెస్టారెంట్లలో క్వార్టర్, హాఫ్ బాటిళ్లు (Half bottles) అందుబాటులోకి రానున్నాయి.