TS POLLS: తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల విత్ డ్రా (Nominations Withdraw) గడువు ముగిసింది. బరిలో ఉన్న రెబల్స్ చేత నామినేషన్ వెనక్కి తీసుకోవడంలో ప్రధాన పార్టీలు విజయం సాధించాయి. మెజార్టీ నేతలు నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. దీంతో ఆ అభ్యర్థులు, అధినేతలు ఊపిరి పీల్చుకున్నారు.
రెబల్స్, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా నామినేషన్స్ విత్ డ్రా చేసుకున్నారు. సీఎం కేసీఆర్ సిట్టింగ్ సీటు గజ్వేల్‌లో ఏకంగా 58 మంది వెనక్కి తీసుకున్నారని తెలిసింది. నిన్నటి వరకు 76 మంది బరిలో ఉండే.. ఇప్పుడు ఆ సంఖ్య 18 మందికి చేరింది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా రెబల్స్‌తో జరిగిన చర్చలు సక్సెస్ అయ్యాయి. సూర్యాపేటలో పటేల్ రమేశ్ రెడ్డి, జుక్కల్‌లో గంగారాం, బాన్సువాడలో బాలరాజు, డోర్నకల్‌లో నెహ్రూ నాయక్, వరంగల్ ఈస్ట్‌లో రాఘవరెడ్డి, ఇబ్రహీంపట్నంలో దండెం రామ్ రెడ్డి నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు.
బీజేపీ రెబల్స్ కూడా నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ప్రకటించారు. నామినేషన్ల పరిశీలన తర్వాత 2898 అభ్యర్థుల నామినేషన్లను నిన్న ఎన్నికల కమిషన్ ఆమోదించింది. వాటిలో 606 నామినేషన్లు తిరస్కరించారు. ఈ రోజు విత్ డ్రా చేసుకోవడంతో 2600 పైచిలుకు క్యాండెట్స్ బరిలో నిలిచే అవకాశం ఉంది.