»Congress Manifesto Release A Shower Of Bounties Is A Party
Manifesto : కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల..వరాల జల్లు కురిపించిన హస్తం పార్టీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.ప్రతి ఒక్కరికీ మేలు చేసేలా ఈ మేనిఫెస్టోని రూపొందించినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా కాంగ్రెస్ అభివర్ణించింది.
జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ముందుగా ప్రకటించిన ఆరు గ్యారంటీలతోపాటు పలు అంశాలను అందులో చేర్చారు. ఖర్గే ఎన్నికల హామీల బుక్లెట్ ‘అభయ హస్తం(Abhaya Hastam)’ను విడుదల చేశారు మొత్తం 62 ప్రధానాంశాలతో.. 42 పేజీలతో ఉంది టీ కాంగ్రెస్ మేనిఫెస్టో. వరంగల్ రైతు డిక్లరేషన్, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్, చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేష్, కామారెడ్డి బీసీ డిక్లరేషన్లను మొదటి 16 పేజీలలో కాంగ్రెస్ తెలిపింది.ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy), ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో అంశాలు..
తెలంగాణ అమరుల కుటుంబ సభ్యులకు రూ. 25 వేల పింఛను. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి 250 గజాల ఇళ్ల స్థలం
రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల పంట రుణమాఫీ
రైతులకు రూ. 3 లక్షల వడ్డీలేని రుణాలు
‘ధరణి’ స్థానంలో ‘భూమాత’ పోర్టల్
వార్షిక జాబ్ క్యాలెండర్ ద్వారా 2 లక్షల ఉద్యోగాల భర్తీ
ఆడపిల్లల పెళ్లికి రూ. లక్షతోపాటు 10 గ్రాముల బంగారం
ఎస్సీ వర్గీకరణ అనంతరం కొత్తగా 3 ఎస్సీ కార్పొరేషన్లు
బీసీ కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు
బీసీ సబ్ ప్లాన్. ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు
సంచార జాతులకు విద్య, ఉద్యోగ అవకాశాలతోపాటు 5 శాతం రిజర్వేషన్లు
పుట్టిన ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక సాయంతో కూడిన ‘బంగారు తల్లి పథకం’
దివ్యాంగుల పింఛన్ రూ. 5,016కు పెంపు, ఉచిత ఆర్టీసీ ప్రయాణం
వ్యవసాయానికి 24 ఉచిత విద్యుత్‌పై మరింత స్పష్టత
సర్పంచుల ఖాతాల్లో పంచాయతీల అభివృద్ది నిధులు
గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు
మరణించిన గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ. 5 లక్షలు
బడ్జెట్లో విద్యారంగం వాటా 15 శాతానికి పెంపు
ఆధునిక సౌకర్యాలతో బస్తీ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు
ఆరు నెలల్లోపు మెగా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ
ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరించి మెరుగైన వైద్యం
ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ పింఛన్ విధానం
జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ. 5 వేల గౌరవ భృతి
మరణించిన జర్నలిస్ట్ కుటుంబాలకు రూ. 2 లక్షలు
ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ. 12 వేల ఆర్థిక సాయం
?????? ???????? ???????? ?????????
AICC president Mallikarjuna Kharge released the Congress manifesto at Gandhi Bhavan