»I Cant Spend A Single Rupee In This Telangana Election Eatala Rajender In Huzurabad
Eatala Rajender: ఈ ఎన్నికల్లో రూపాయి కూడా ఖర్చుపెట్టలేను!
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నేత, హుజురాబాద్ ప్రస్తుత ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా తాను ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేనని ఈటల అన్నారు. అంతేకాదు ప్రస్తుతం తన వద్ద ధైర్య లక్ష్మి మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాలు పలురకాలుగా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
i Cant spend a single rupee in this telangana election Etala Rajender in huzurabad
తెలంగాణలో ఈనెల 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేత, హుజూరాబాద్(huzurabad) ప్రస్తుత ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eatala Rajender) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తన దగ్గర డబ్బులు లేవని..ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లేదని అన్నారు. అంతేకాదు గత ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ తనను చాపను రాకినట్లు రాకాడని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ప్రస్తుతం తన దగ్గర ధైర్య లక్ష్మి మాత్రమే ఉందన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ చాలా ఇబ్బంది పెట్టినట్లు ఈటల వాపోయారు.
డబ్బులు ఉంటేనే రాజకీయం కాదని, మనీ లేకపోయినా కూడా తాను రాజకీయం చేస్తానని ఈటల రాజేందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నేతలు ప్రతి ఒక్క ఓటుకు రూ.2 వేల నుంచి 3 వేల వరకు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఓటర్లు ఇతర పార్టీల నేతలు ఇచ్చే నగదు తీసుకుని బీజేపీకి ఓటువేసి తనను గెలిపించాలని కోరారు. తన ధైర్యం, శక్తి హుజురాబాద్ ప్రజలేనని(people) ఈటల అన్నారు. అయితే ఈటల వ్యాఖ్యల నేపథ్యంలో పలువురు ఓటమి భయంతోనే ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. గత ఉప ఎన్నికలో గెల్చిన ఈటలకు ఈసారి ఎందుకు భయం పట్టుకుందని ప్రశ్నిస్తున్నారు. లేదంటే సీఎం కేసీఆర్ కు కోవర్టుగా మారారా అని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈటెల రాజేందర్ మొదట 2004లో కమలాపూర్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ (TDP) ముద్దసాని దామోదర్ రెడ్డిపై 19,619 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2008లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన మళ్లీ ఆ స్థానాన్ని గెలుచుకున్నారు. 2009లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వి.కృష్ణమోహన్‌రావుపై 15 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. మళ్లీ 2010 (ఉప ఎన్నిక), 2014, 2018లో టీఆర్ఎస్ అభ్యర్థిగా నియోజకవర్గంలో గెలుపొందారు. భూ ఆక్రమణల ఆరోపణలపై 2021లో కేసీఆర్ తన మంత్రివర్గం నుంచి ఈటెలను తొలగించారు. ఆ తర్వాత బీజేపీలో చేరి హుజూరాబాద్ నుంచి ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 2023లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మళ్లీ హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్ నుంచి కూడా సీఎం చంద్రశేఖర్ రావుపై రాజేందర్ పోటీ చేస్తున్నారు.