»Telangana Elections Closed Nominations 594 Applications Rejected In Telangana
Telangana Elections: ముగిసిన నామినేషన్ల పర్వం.. తెలంగాణలో 594 అప్లికేషన్లు రిజెక్ట్
నవంబర్ 10వ తేదితో తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. ఇకపోతే నేడు వాటిని ఈసీ పరిశీలించింది. 5563 అప్లికేషన్లు రాగా అందులో 2444 అప్లికేషన్లను మాత్రమే ఈసీ ఆమోదించింది. 594 మంది అప్లికేషన్లను ఈసీ రిజెక్ట్ చేసింది.
తెలంగాణ ఎన్నికలకు (Telangana Elections) మరికొన్ని రోజులే ఉన్నాయి. ఈ తరుణంలో నవంబర్ 10వ తేదితో నామినేషన్ల (Nominations) పర్వం ముగిసింది. అలాగే నేడు నామినేషన్ల పరిశీలన కూడా పూర్తయ్యింది. కాగా తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తంగా 5563 అప్లికేషన్లు వచ్చినట్లు ఎలక్షన్ కమిషన్ (Election Commissions) అధికారులు వెల్లడించారు. అందులో కేవలం 2444 అప్లికేషన్లకు మాత్రమే ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఇకపోతే 594 మంది అప్లికేషన్లను ఈసీ రిజెక్ట్ చేసింది.
ఈసీ (EC) రిజెక్ట్ చేసిన అప్లికేషన్లలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి , ఈటెల రాజేందర్ సతీమణి జమున అప్లికేషన్లు కూడా ఉన్నాయి. అప్లికేషన్లను ఎంత మంది ఉపసంహరించుకున్నారు? చివరి పోటీలో ఎంత మంది ఉంటారనే వివరాలను ఎన్నికల సంఘం ఇంకా వెల్లడించలేదు. అప్లికేషన్లను తిరస్కరించడంపై సర్వత్రా అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది.
కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేసిన జానారెడ్డి అప్లికేషన్‌ను తిరస్కరించడం పట్ల పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అలాగే బీజేపీ తరపున ఈటెల జమున కూడా నామినేషన్ వేసింది. ఆ అప్లికేషన్‌ను కూడా ఈసీ తిరస్కరించింది. బీఫాం సమర్పించకపోవడంతో నామినేషన్‌ను ఈసీ తిరస్కరించినట్లు తెలుస్తోంది. నవంబర్ 15వ తేది వరకూ నామినేషన్ల తిరస్కరణకు గడువు ఉంది. 15 తర్వాత బరిలో నిలిచేవారి చివరి లిస్ట్‌ను ఎన్నికల సంఘం ప్రకటించనుంది.