»Congress Leader Jana Reddy Nomination Rejected At Nagarjuna Sagar Constituency
Jana reddy: కాంగ్రెస్ నేత జానారెడ్డికి షాకిచ్చిన అధికారులు!
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. అయితే నామినేషన్ ఎందుకు రిజెక్ట్ చేశారనే వివరాలు తెలియాల్సి ఉంది. నాగార్జునా సాగర్ నియోజకవర్గం నుంచి జానారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
congress leader jana reddy nomination rejected at nagarjuna sagar constituency
తెలంగాణ(telangana)లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది నేతల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. మరోవైపు ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా..ఇక వాటిని అధికారులు పరిశీలిస్తూ నిబంధనలు పాటించని వాటిని తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి(jana reddy) దాఖలు చేసిన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసేందుకు జానారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 28 నామినేషన్లు దాఖలు చేయగా..వాటిలో ఏడుగురు అభ్యర్థుల నామినేషన్లను అధికారులు రిజెక్ట్ చేశారు. వాటిలో జానారెడ్డి పేరు కూడా ఉండటం విశేషం. అయితే నామినేషన్ ఎందుకు రిజెక్ట్ చేశారనే దానిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు జానారెడ్డి కుమారుడు జయవీర్ కూడా ఈ ఎన్నికల బరిలో పోటీ చేసేందుకు నామినేషన్(nomination) దాఖలు చేశారు. అయితే జానారెడ్డి మాత్రం నామమాత్రంగానే నామినేషన్ దాఖలు చేసినట్లు చెబుతున్నారు. గతంలో నాగార్జునసాగర్‌కు ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కుందూరు జానా రెడ్డికి తెలంగాణలోని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా మంచి గుర్తింపు ఉంది. చాలా గ్రామాల్లో ఇతనికి నమ్మకమైన మద్దతుదారులు కూడా ఉన్నారు. మరి వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని ప్రజలు గెలిపిస్తారా లేదా అనేది చూడాలి.