»Election Flying Squad And Police Checked Congress Leader Madhu Yashki House
Madhu Yashki ఇంట్లో అర్ధరాత్రి సోదాలు.. కాంగ్రెస్ నేత సీరియస్
కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ ఇంట్లో అర్ధరాత్రి పోలీసులు, ఎన్నికల ఫ్లైయింగ్ స్వ్కాడ్ అధికారులు సోదాలు జరిపారు. వారితో మధుయాష్కీకి తీవ్ర వాగ్వివాదం జరిగింది.
Election Flying Squad And Police Checked Congress Leader Madhu Yashki House
Madhu Yashki: కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ (Madhu Yashki) ఇంట్లో అర్ధరాత్రి ఎన్నికల ఫైయింగ్ స్వ్కాడ్, పోలీసులు సోదాలు నిర్వహించారు. హయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా యాష్కి ( Yashki)బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో తాత్కాలికంగా ఉంటోన్న ఇంట్లో చేసిన రైడ్స్ కలకలం రేపాయి. సోదాలు చేసేందుకు వచ్చిన అధికారులు, పోలీసులతో మధుయాష్కీకి వాగ్వివాదం జరిగింది.
తనిఖీల పేరుతో తన కుటుంబ సభ్యులను ఇబ్బందికి గురిచేశారని మధు యాష్కీ అంటున్నారు. అధికార పార్టీ ఒత్తిడితో తన ఇంటిపై తనిఖీలు చేపట్టారని ఆరోపించారు. ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. మధుయాష్కీ ఆరోపణలు ఇలా ఉండగా.. పోలీసులు కూడా స్పందించారు.
యాష్కీ ఇంట్లో భారీగా నగదు నిల్వ చేశారని తమకు ఫిర్యాదు వచ్చాయని పోలీసులు వివరించారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు డబ్బు పంపిణీ చేస్తున్నారనే సమాచారంతో తనిఖీ నిర్వహించామని.. ఇది తమ డ్యూటీ అని చెబుతున్నారు. అదేం లేదు.. కావాలని, వేధించాలని ఉద్దేశంతో రైడ్ చేశారని యాష్కీ అంటున్నారు. ఈసీ వద్దకు వెళుతుండా.. ఎన్నికల సంఘం ఏం చెబుతుందో చూడాలి మరీ.