»Rs A Case Has Been Registered Against Rs Praveen Kumar And His Son For Stealing Rs 25000
RSP : రూ.25 వేలు చోరీ చేశారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఆయన కుమారుడిపై కేసు నమోదు
సిర్పూర్ నియోజకవర్గ వర్గంలోని పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ప్రవీణ్‌కుమార్, ఆయన కుమారుడిపై ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.
పోలీస్ శాఖ(Police Department)లో నేను 26 సంవత్సరాలు పని చేసిన ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని నాపై, నా కొడుకుపై 25 వేల రూపాయలు దోచుకున్నామని తప్పుడు కేసులు పెట్టారని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ (RS Praveen Kumar) ఆవేదన వ్యక్తం చేశారు. సిర్పూర్ కోనప్ప ఎమ్మెల్యే వాహనం నుంచి తాను రూ. 25 వేలు దొంగిలించానని, ఆయన డ్రైవర్ ఫిర్యాదు చేశాడన్నారు. ఓ రిటైర్డ్ ఎస్పీ, అందులోనే 26 ఏళ్లు మచ్చలేకుండా సేవ చేసిన అధికారి రూ. 25 వేలు దొంగతనం చేస్తాడా? అని ప్రశ్నించారు. ప్రవీణ్‌కుమార్, ఆయన కుమారుడిపై కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ (Kagaznagar) పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.
ఆదివారం రాత్రి బీఎస్పీ (BSP), బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన గొడవ ఘర్షణ నేపథ్యంలో ఈ కేసు నమోదైంది.రెండు దశాబ్దాలుగా కోనేరు కోనప్ప వల్ల సిర్పూరు కాగజ్‌నగర్ ప్రాంత వాసులకు దక్కుతున్నదేమిటో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చని అన్నారు. కేసీఆర్ దుష్పరిపాలనకు ఇదో మచ్చుతునక అని విమర్శించారు. సిర్పూర్ నియోజకవర్గం(Sirpur Constituency)లోని పోలీసులు ఏకపక్షంగా వవ్యహరిస్తున్నారు అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. జిల్లా ఎస్పీ మీద మాకు నమ్మకం లేదు.. ఎల్లెక్షన్లు సజావుగా జరగాలంటే జిల్లా ఎస్పీతో పాటు కాగజ్ నగర్ డీఎస్పీ, సీఐని ఇక్కడి నుండి బదిలీ చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే నియోజక వర్గంలో అరాచక పాలన కొనసాగిస్తున్నారు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. మా బండ్లు, కళా బృందాలను అడుగడుగునా అడ్డుకుంటున్నారు.. బీజేపీ, బీఆర్ఎస్ (BRS) లు రెండు ఒక్కటే అని అన్నారు. ఆదివారం రాత్రి కాగజ్‌నగర్‌లో బీఎస్పీ-బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. బీఎస్పీ బహిరంగ సభ ప్రదేశానికి బీఆర్ఎస్ ప్రచార వాహనాలు పెద్దసౌండ్‌తో పాటలు పెట్టుకుంటూ రావడం గొడవకు కారణమైంది. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రవీణ్ కుమార్ కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు.