మేనిఫెస్టో రూపకల్పన గురించి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో చర్చిస్తున్నారు. వరసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అనుసరించాల్సిన వ్యుహాంపై డిస్కష్ చేస్తున్నారు.
CM KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీలు బిజీ బిజీగా ఉన్నాయి. టికెట్ల కేటాయింపు, మేనిఫెస్టో రూపకల్పన.. జనంలోకి వెళ్లడంపై ఆలోచిస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ అయితే టికెట్ల కేటాయింపు ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యింది. కేసీఆర్ (KCR) బహిరంగ సభలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయ్యింది. మిగిలింది మేనిఫెస్టో రూపకల్పన.. దానిపై చర్చించేందుకు ప్రగతి భవన్‌కు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు వచ్చారు. సీఎం కేసీఆర్‌తో (KCR) డీప్‌గా డిస్కస్ చేస్తున్నారు.
వరసగా మూడోసారి అధికారం చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటోంది. అందుకోసం కీలకమైన అంశం మేనిఫెస్టో.. దానిపై మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ చర్చిస్తున్నారు. చేసిన సంక్షేమ పథకాలతోపాటు.. చేయాల్సిన అంశం గురించి చర్చకొచ్చినట్టు సమాచారం. పెన్షన్లు, రుణమాఫీ, దళితబంధు.. ఇతర అంశాల గురించి డిస్కష్ చేసే అవకాశం ఉంది.
గత కొద్దిరోజుల నుంచి కేసీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైరల్ ఫీవర్ రావడంతో బయటకు రావడం లేదు. ఛాతీలో ఇన్ ఫెక్షన్ వచ్చిందనే వార్తలు కూడా వచ్చాయి. ఎన్నికలు సమయం దగ్గర పడటంతో 17 రోజుల్లో 41 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారం చేయనున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు షెడ్యూల్ చేశారు.