అభ్యర్థుల ఖర్చుపై ఎన్నికల సంఘం ఫోకస్ చేసింది. ఎక్కువ ఖర్చు చేస్తోన్నప్పటికీ.. తక్కువ చూపిస్తున్నారు. అందుకే ఈ సారి ఒక్కో అంశానికి ధరలను ఫిక్స్ చేసింది.
Karimnagar Collector And Police Commissioner Transfer
Election Commisssion: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులపై ఎన్నికల సంఘం (Election Commisssion) దృష్టిసారించింది. ఇకపై క్యాండెట్స్ ఇష్టానుసారంగా ఖర్చులు చేస్తానంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. రోజు ప్రొద్దున చేసే టిఫిన్ ((tiffin), మధ్యాహ్నాం బిర్యానీ (biryani), స్నాక్స్ (snacks), టీ (tea), వెహికిల్ కిరాయి, ఫంక్షన్ హాల్ ఖర్చులకు సంబంధించి నిబంధనలను రూపొందించింది. ఇకపై అభ్యర్థుల ఆ మేరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
నీళ్ల ప్యాకెట్‌కు (water pocket) కూడా ధర కేటాయించారు. సభలు, సమావేశాల్లో ఏర్పాటు చేసే బెల్లూన్లు, ఎల్ఈడీ స్క్రీన్లకు కూడా ధరలు నిర్ణయించారు. ఒక్కో బెలూన్‌కు రూ.4 వేలు, స్క్రీన్కు రూ.15 వేలు రోజు రెంట్ ఇవ్వొచ్చని స్పష్టంచేశారు. పట్టణ ప్రాంతాల్లో ఫంక్షన్ హాల్ ఒక రోజు కిరాయి తన ఖర్చులో అభ్యర్థి రూ.15 వేలను చూపించాల్సి ఉంటుంది. కుర్చీలు, టేబుళ్లు, వాహనాల కిరాయి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే కళాకరుల పారితోషికం వివరాలు చెప్పాలని ఈసీ అధికారులు తేల్చిచెప్పారు.
నిజానికి ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చులు ఎక్కువ.. తక్కువ చూపిస్తున్నారు. అందుకోసం 2014లో ఉన్న అభ్యర్థుల వ్యయాన్ని ఈసీ పెంచింది. 2014లో ఎంపీ అభ్యర్థి పరిమితి మ్యాగ్జిమమ్ రూ.75 లక్షలు ఉండగా.. 2022లో ఆ మొత్తం రూ.90 లక్షలకు పెంచింది. ఎమ్మెల్యే అభ్యర్థి వ్యయం కూడా రూ.28 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచింది.
గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం అని క్యాటగిరీ విభజించి ధర నిర్ణయించారు. డీసీఎం వ్యాన్, మినీ బస్సు, ఇన్నోవా కారు, పెద్ద బస్సు, బెలూన్, డ్రోన్ కెమెరా, ఫంక్షన్ హాల్, ఎల్ఈడీ స్క్రీన్, పెద్ద సమోస, వాటర్ బాటిల్, భోజనం ధరలు సేమ్ ఉన్నాయి. పులిహోర, టిఫిన్, వెజిటేబుల్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ధరల్లో మాత్రం డిఫరెన్స్ ఉంది.