CM అభ్యర్థిపై వీడని ఉత్కంఠ.. ఢిల్లీకి చేరిన చర్చలు..?
తెలంగాణ సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరింది చర్చల వ్యవహారం.. అక్కడ డీకే శివకుమార్ హైకమాండ్ పెద్దలతో చర్చలు జరిపి, సీఎం అభ్యర్థిపై స్పష్టత తీసుకు రానున్నారు.
Telangana CM: తెలంగాణలో సీఎం (Telangana CM) అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం నుంచి ఆ ఎపిసోడ్ కంటిన్యూ అవుతూనే ఉంది. హోటల్లో ఎమ్మెల్యేల అభిప్రాయంతో ఏకవాఖ్య తీర్మానం పంపించడంతో మొదలైన సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆ వెంటనే అధ్యక్షుడు ఖర్గేకు చేరడం.. ఇతరులను సంప్రదించి సీఎం ఎవరని ప్రకటిస్తారని అనుకున్నారు.
సీన్ మారింది. ఎల్లా హోటల్ నుంచి సీనియర్లు వెళ్లడం.. తర్వాత డీకే శివకుమార్ ఢిల్లీకి బయల్దేరినట్టు తెలుస్తోంది. హైకమాండ్‌తో చర్చించి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. అది ఈ రోజు అయితే కాదు.. రేపు కావచ్చు.. లేదంటే 9వ తేదీ కావచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
అంతకుముందు ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ అయ్యింది. సమావేశంలో సీఎం అభ్యర్థిపై స్పష్టత వస్తుందని అనుకున్నారు. అక్కడ అంతే పరిస్థితి.. డీకే ఢిల్లీ వెళ్లి.. హై కమాండ్ పెద్దలతో చర్చించిన తర్వాత.. కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయం ప్రకారం సీల్డ్ కవర్లో పేరు రానుంది. అప్పటివరకు ఉత్కంఠ కొనసాగనుంది.
ఇటు పాత అసెంబ్లీ రద్దు చేశారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి ప్రకటన వెలువడింది. అంతకుముందు గవర్నర్‌తో అసెంబ్లీ కార్యదర్శి సమావేశం అయ్యారు. రాజ్ భవన్లో సీఎం ప్రమాణం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేతను ప్రకటిస్తే.. సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. తొలుత కొద్దిమందితో ప్రభుత్వం కొలువుదీరుతుంది. ఆ తర్వాత పునర్ వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉంది.