డంకీ, సలార్ సినిమాలు ఒక్క రోజు గ్యాప్‌లో పాన్ ఇండియా రేంజ్లో భారీ హైప్‌తో థియేటర్లోకి వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా ఇప్పుడు తమ తమ ఓటీటీ పార్ట్నర్స్ ఫిక్స్ చేసుకున్నాయి. మరి డంకీ, సలార్ డిజిటల్ స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Dunki, Salaar: పఠాన్, జవాన్ వంటి హిట్లు ఇచ్చి.. రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. ఇప్పుడు డిసెంబర్ 21న డంకీ (Dunki) సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. తాప్సి పన్ను హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో విక్కీ కౌశల్ మరో ముఖ్య పాత్రలో నటించాడు. బాలీవుడ్ బడా డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి ఈ సినిమాను తెరకెక్కించాడు. కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ‘డంకి’.. ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిందనే టాక్ నడుస్తోంది. డే వన్ వసూళ్లు 70 కోట్లు కూడా దాటలేదని సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ సంస్థ జియో సినిమా సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా నిర్మాణంలో జియో స్టూడియోస్ వారు కూడా భాగం కావడంతో జియోలో డంకీ డిజిటల్ స్ట్రీమింగ్కు రానుంది. అయినా కూడా భారీ ధరకు సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఏకంగా 155 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిందని సమాచారం.
డంకీ రిలీజ్ అయిన నెక్స్ట్ డే నుంచి బాక్సాఫీస్ పై డైనోసర్ దండయాత్ర స్టార్ట్ అయింది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో.. హోంబలే ఫిల్మ్స్ భారీ ఎత్తున నిర్మించిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న గ్రాండ్‌గా థియేటర్లోకి వచ్చింది. శృతి హాసన్ హీరోయిన్గా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీ రోల్ ప్లే చేసిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ప్రభాస్ సాలిడ్ బౌన్స్ బ్యాక్ ఇచ్చాడని అంటున్నారు. ఇక ఓటిటి కి సంబంధించి డీటెయిల్స్ ఇపుడు బయటకి వచ్చాయి. ఈ సినిమా ఓటిటి హక్కులని ఓటిటి దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. దీంతో సలార్ థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత.. నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు రానుంది. మరి డంకీ, సలార్ ఎప్పుడు ఓటిటిలోకి వస్తాయో చూడాలి.